శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభోత్సవం.

శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభోత్సవం.
నవ తరంగాలు / పర్వతగిరి : పర్వతగిరిలో శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభం. రైతులకు మార్కెట్ ధరల ప్రకారం సరుకుల కొనుగోలు చేస్తాం: యాజమాన్యం. మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ జగదాంబ ట్రేడర్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అజ్మీర మంగ్య తండ టెంపుల్ పీఠాధిపతి భావుసింగ్ మహరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అజ్మీర మంగ్య తండ ఉపసర్పంచ్ సుమన్, మాజీ ఉపసర్పంచ్ మురళి, టెంపుల్ చైర్మన్ మూడు శ్రీను, సపావట్ సజ్జన్, రామన్నకుంట తండ పార్టీ అధ్యక్షుడు సుమన్తో పాటు పలువురు పెద్దలు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ జగదాంబ ట్రేడర్స్ యాజమాన్యులు భూక్య రవినాయక్, హాట్య నాయక్ మాట్లాడుతూ.. రైతులకు మార్కెట్ ధరల ప్రకారం సరుకులు కొనుగోలు చేస్తూ, వారి అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉంటూ వారి ఆర్థిక అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్దలు, అతిథులు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

