బహుజనులను(బీసీలను) విస్మరించిన భారత రాజ్యాంగం

బహుజనులను(బీసీలను) విస్మరించిన భారత రాజ్యాంగం
మద్దెల ఎల్లేష్ నేదునూరి రాజమౌళి
అక్టోబర్ 16 శుక్రవారం కాజీపేట / nvtnews : దేశానికి స్వరాజ్యం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం 1931లో బీసీల జనాభా జన గణ లో భాగంగా నిర్వహించడం జరిగింది స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు భారత రాజ్యాంగం ఏర్పడి 76 సంవత్సరాలు గడిచినప్పటికీ భారత పాలకులు బిసి జనాభాను జన గణనలో భాగంగా లెక్కించకపోవడం వలన ఆర్థిక సాంఘిక రాజకీయ రంగాలలో బీసీల యొక్క భాగాన్ని పాలకులైన ఎగువ కులాలు మెక్కడం జరిగిందని మద్దెల ఎల్లేష్ భారత కమ్యూనిస్టు పార్టీ అనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి. నేదునూరి రాజమౌళి బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి తెలిపారు వేల సంవత్సరాలుగా మనుస్మృతి మనుధర్మ శాస్త్రం ప్రజలను నాలుగు వర్ణాలుగా విడగొట్టి శూద్రులు అతిశూద్రులు విభజించి ఓబీసీలకు రాజ్యాంగ హక్కులు ఆస్తి హక్కు విద్య ఉద్యోగ హక్కులు దక్కకుండా వివక్షతతో జ్ఞానానికి సంపదకు దూరం చేసి అణిచివేయడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు భారత రాజ్యాంగం కూడా ఇతర సామాజిక వర్గాలకు రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ చట్టసభలలో కల్పించడం జరిగింది కానీ బీసీలకు మాత్రం జనాభా ఆధారంగా విద్యా ఉద్యోగాలలో చట్టసభలలో రాజ్యాంగం హక్కు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు బడ్జెట్లో ఓ బీసీలకు 50 శాతం కేటాయించాలని విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో 56% రిజర్వేషన్ కల్పించాలని ఇది బీసీల హక్కు మాత్రమేనని పాలకులు వేసే బిక్ష కాదన్నారు మండల్ కమిషన్ వేస్తే సవర్ణులు రిజర్వేషన్ల వ్యతిరేక మంటలు లేపడం జరిగిందని తెలిపారు 1953 55 లో మొదటి జాతీయ బీసీల రిజర్వేషన్ కమిషన్ 1978 – 80రెండవ జాతీయ బీసీ కమిషన్ బీపీ మండల్ అధ్యక్షతన 41 సిఫారసులు చేయడం జరిగింది దీనిని 1990 వరకు పట్టించుకోలేదు అనంతరం కేవలం విద్యా ఉద్యోగాలలో 27% మాత్రమే ఇస్తున్నారు జనాభా ఆధారంగా 56% ఇవ్వాలి అన్నారు శుక్రవారం రోజున కాజీపేట మండలం మడికొండ గ్రామంలో బీసీ హక్కుల సాధన సమితి సమావేశం గోపన బోయిన నరసమ్మ అధ్యక్షతన జరుగగా సమావేశమునకు భారత కమ్యూనిస్టు పార్టీ హనుమకొండ జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్ బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నేదునూరి రాజమౌళి హాజరై మాట్లాడుతూ చట్టసభలలో శాసనసభలో స్థానిక సంస్థలలో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రైవేట్ రంగంలో కూడా ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం స్థానిక సంస్థలు రిజర్వేషన్లు కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు నవంబర్ 21 22 తేదీలలో హైదరాబాదులో జరుగు బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర మహాసభలను అధిక సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో గోపిన బోయిన సాంబయ్య నరేష్ సురేష్ రజిత తొర్రి మల్లయ్య తొర్రి లచ్చమ్మ తొలి రమేష్ తొర్రి కుమార్ రాధిక అన్విత రాజు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *